రాజధాని పేరెత్తకుండానే…అధికార వికేంద్రీకరణ

నిన్న మొన్నటి వరకు మూడు రాజధానులంటూ పదే పదే ప్రస్తావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదిశగా ఏర్పాటు చేసిన కమిటీలతోనూ అదే తరహా నివేదికలు తెప్పించుకుంది. అయితే తమ ఆలోచనలకు కార్యరూపం తీసేకొచ్చేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలని వేదికగా చేసుకుని రాజధానులుగా ఎక్కడా ప్రస్తావించకుండా..జాగ్రత్తగా..
ఏపీలో మారుతున్న రాజకీయ పరిణామాలు, అమరావతిపై పెరుగుతున్న సెంటిమెంట్లుతో న్యాయ పరంగా..రాజకీయంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకుంటూ తమపనికానిచ్చేయాలని భావిస్తోంది. రాజధానుల పేరు ప్రస్తావిస్తే న్యాయ పరమైన చిక్కులకు తామే అవకాశం ఉందన్న ఇప్పటికే న్యాయ నిపుణులతో సుదీర్ఘ సంప్రదింపులలలో స్పష్టం కావటంతో వారి సలహా మేరకు రాజధాని పేరెత్తకుండానే…అధికార వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం వ్యూహాలు అమలు చేయబోతున్నట్టు సమాచారం. కొనసాగిస్తోంది
ఈ సమస్యను సాగదీయకుండా..సాధ్యమైనంత త్వరగా తమ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకు రావాలని నిర్ణయించిన ప్రభుత్వం తొలుత కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసి..ఆ వెంటనే అసెంబ్లీకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసిందని, దీనికోసం సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసిందని సన్నిహిత వర్గాల భోగట్టా..