రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ లేటెస్ట్ అప్ డేట్ !

రామ్ చరణ్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. కాగా ఈ రోజు నుంచి ఎన్టీఆర్ ఈ సినిమాలో తన క్యారెక్టర్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నారు. లియోడ్ స్టీఫెన్స్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ శిక్షణను ప్రారంభించారు. మొత్తానికి ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ వైవిధ్యంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.