“పోస్టర్` టీజర్ విడుదల

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్ బ్యానర్ పై టి.మహిపాల్ రెడ్డి (TMR) దర్శకుడిగా విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి సంబంధించిన టీజర్ నిర్మాత డి.సురేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ సందర్భం గా సురేష్ బాబు మాట్లాడుతూ… ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ ఎంతో ఫేమస్. అందులో ఎన్నో సినిమాలు వంద రోజులు ఆడాయి. అలాంటి థియేటర్ లో ప్రొజెక్టర్ గా పదేళ్లు పని చేసిన టి.మహిపాల్ రెడ్డి డైరెక్టర్ గా మారి “పోస్టర్` చిత్రాన్ని తెరకెక్కించాడంటే నమ్మలేదు. కానీ `టీజర్ చూసిన తరువాత మహిపాల్ రెడ్డి ప్రతిభ అర్ధమైంది. అతను ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రాన్ని తీసాడు ధియేటర్ నేపథ్యంలో తీసిన ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులను ధియేటర్ కి రప్పించే లా ఈ టీజర్ ఉంది అన్నారు.
దర్శకుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ… . ప్రతి ఇంట్లో జరిగే కథనే నేను సినిమాగా తీశాను. పోస్టర్ అంటించడానికి కూడా పనికి రాని ఒక వ్యక్తి .. పోస్టర్ మీదకు ఎక్కే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది సినిమా కాన్సెప్ట్. చిన్న విషయాలకే క్రుంగి పోయి ఆత్మ హత్యలు చేసుకోవద్దు అని చెప్పే ప్రయత్నం చేసామన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే లు పాల్గొన్నారు.