గోడ మీద వార్తలు

26 – 02 – 2020
01 . కలెక్టర్లు ప్రజలని సంతోషపెట్టి భూములని తీసుకోవాలి – ప్రభుత్వానికి ఎవరి ఉసురూ తగలకూడదు – జగన్ …
అదేటన్నాయ్ అట్టంటావ్ – నీ పిలుపు విని ఎగేసుకొచ్చి ఎకరాలకెకరాలు ఇచ్చేస్తన్నారని నీ పాంప్లెట్ పత్రికలో పెద్ద పెద్ద అచ్చరాలతో గుద్దేస్తంటే …??
02. ఆర్ధిక నేరగాడు కాబట్టే ట్రంపుని కలిసేందుకు జగన్ ని పిలువలేదు – చంద్రబాబు …
ఇంకానయం – మీకు ఇంగ్లీషు రాదని మిమ్మల్ని పిలవలేదనలేదు – ఐనా నీ నలభైఏళ్ళ అనుభవానికి ఈ పిల్ల స్టేట్మెంట్లేంది సామీ..!!
03. ప్రపంచంలో టాప్ 30 వాయు కాలుష్య నగరాల్లో 21 నగరాలు మనవేనని తేల్చిన ఓ తాజా నివేదిక …
పచ్చదనం పేరుతో చెట్లని కాకుండా బెత్తెడు ఎత్తుండని క్రాటన్లని పెంచుకుంటే పొల్యూషను పెరక్క తగ్గుద్దా ..?? దానికి తోడు కొంపకో రెండు వాహనాలు ..!!
04. ట్రంప్ పర్యటనలో భాగంగా రక్షణ రంగంలో భారత్ తో 3 బిలియన్ డాలర్ల ఒప్పందాలు చేస్కున్న – అమెరికా …
ఆయుధాలమ్ముకునేటోడు ఆడొచ్చిన పని బాగానే చక్కబెట్టుకుపోయాడన్న మాట …!!
05. తెలంగాణలో నెల రోజులు తిరక్కుండానే రెండు సార్లు పెరిగిన పాల ధరలు – తాజాగా పాల కొరత పేరుతో 2 – 6 రూపాయల వరకూ పెంచిన – సంస్థలు …
ఇట్టాంటి గోలలు పడలేకేనేమో – ఎనకటి రోజుల్లో ఇంటికో బర్రెను పెంచుకునేటోళ్ళు …!!
మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!!
“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ”