మ‌త్తెక్కించే అందాల‌తో కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తూ బీచ్‌కి…!

బాలీవుడ్‌కి  టాలీవుడ్‌కి ఈ ఒక్క విష‌యంలో మాత్రం చాలా తేడా ఉంటుంది. అదేమిటంటే టాలీవుడ్ లో హీరోల అమ్మాయిలు ప‌ద్ద‌గా ఇండ‌స్ట్రీకి రారు. అందుకు ఇక్క‌డి ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు. కానీ బాలీవుడ్ అలా ఉండ‌దు వాళ్ల టాలెంట్‌ని నిరూపించుకోడానికి ఆడ లేదు మ‌గా లేదు అంద‌రు స‌రి స‌మానంగా వ‌స్తారు. ఇక స్టార్స్ కూతుళ్ల‌కి గుర్తింపు రావాలంటే పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. వాళ్లు పుట్టుక‌తోనే గోల్డ్ స్పూన్లు అంటారు అందుకే. ప‌లానా వాళ్ల పిల్ల‌లంటే చాలు ఆటోమెటిక్‌గా స్టార్‌డం ఉంటుంది.

ఇక సోష‌ల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సారాల‌లీఖాన్‌. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూతురైన సారాకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో ఖాతాలు తెరిచిన కొన్ని రోజులకే 20 లక్షల మందికి పైగా ఫాలోవర్లు పెంచుకుంది ఈ భామ‌. ఏదన్నా ఫొటో పెట్టగానే గంటకే పది లక్షలకు పైగా లైక్స్ వస్తున్నాయంటే ఆమెకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సారా స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. సముద్ర తీరాన ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో బికినీ వేసుకుని దిగిన ఫొటోలకు సముద్రమే నివ్వెరపోయిందంటే అతిశయోక్తి కాదు. ఈ ఫొటోలు పోస్ట్ చేయడం ఆలస్యం.. లైక్ బటన్ నొక్కి పడేయడానికి నెటిజన్లు కాచుకు కూర్చున్నట్లున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో ఫొటోల‌కి లైకులు, కామెంట్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కుర్రాళ్ళ గుండెల్లోంచి క‌విత్వాలు పొంగుకొస్తున్నాయి.
‘నీ అందాలతో చంపేసేటట్టు ఉన్నావే’ అని ఒకరు, ‘భూమ్మీదే సెక్సియస్ట్ వుమెన్’ అంటూ కామెంట్లతో ఆమె అందాన్ని తెగ వర్ణించేస్తున్నారు. ఇప్పుడున్న స్టార్ కిడ్స్‌లో సారా అలీ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు. ఆలియా భట్, శ్రద్ధా కపూర్లు స్టార్ కిడ్సే అయినప్పటికీ ఇండస్ట్రీలో తమకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడ్డారు. కానీ సారా చేసింది రెండు సినిమాలే అయినా స్టార్ హీరోయిన్‌కు ఉండాల్సినంత క్రేజ్ వచ్చేసింది. ఆమె మ‌త్తెక్కించే అందాల‌తో కుర్రాళ్ల‌కు పిచ్చెక్కిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.