నలభైకోట్లు దోచుకుంటే శశికళ ను నాలుగ ఏళ్ళు జైలులో పెడితే ….. 43 వేలకోట్లు దోచుకున్న జగన్ ను జీవితాంతం జైలులో పెట్టాలి…..
నలభైకోట్లు అక్రమాస్తుల కలిగి ఉన్న శశికళను నాలుగేళ్ళ జైలులో పెడితే 43 వేల కోట్ల రూపాయలు దోచుకున్న జగన్ ను జీవితాతం జైలులో పెట్టాల్సి ఉంటుందని ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న అన్నారు. వైసిపిలో ఉన్న ఉన్నత స్ధాయి నేతలు అందరూ ఏ1 మొదలుకోని ఏ4 లుగా వివిధ కేసుల్లో ఉన్న వారేనని పేర్కోన్నారు. చంద్రబాబుపై అవినీతి చక్రవర్తి అని అచ్చుతప్పు పుస్తకాన్ని జగన్ ముద్రించారన్న ఆయన ఆ పుస్తకం పేరు అభివృద్ది చక్రవర్తి అన్నారు. తండ్రి పదవిని అడ్డంపెట్టకోని అడ్డగోలుగా సంపాదించుకున్న జగన్, ప్రతి శుక్రవారం కోర్టుకు ఎందుకు వెళుతున్నారో చెప్పాలన్నారు. పూర్తిగా అవినీతి మయంగా మారిన జగన్ అవినీతి అంటూ నీతులు వల్లించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు ప్రాధాని ఏపిలో బిజెపి పార్లమెంటు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫురెన్స్ నిర్వహిస్తే తప్పు లేదన్న ఆయన కాంగ్రెస్ తో కలిసి టీడీపీ మరోసారి ఎన్టీఆర్ కు వెన్ను పోటు పోడిచిందనే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలుగదేశంను కేంద్రం పెత్తనానికి వ్యతిరేఖంగా ఎన్టీఆర్ స్ధాపించారని దానికి రెండింతలు కేంద్ర పెత్తనం ఇప్పడు కొనసాగుతోందన్నారు. అందకే బిజెపికి వ్యతిరేఖంగా టీడీపీ రాష్ట్రప్రయోజనాల కోసం పోరాడుతుంటే విపక్షాల మాత్రం మోకాలడ్డతన్నాయని మండిపడ్డారు.