ఏసీబీ వలలో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ సర్వేయర్ శ్రీ D. కోటేశ్వరరావు

నిన్న (ది.19.2.2020) సాయంత్రం ఫిర్యాది అయిన M సోమి ప్రసాద్, అనంతపురం అను వాని వద్ద నుండి లంచంగా 7 లక్షల రూపాయలు, అతనికి సంబంధించిన ఇళ్ల స్థలములు సర్వే చేసి రిపోర్టు ఇవ్వడానికి అడిగి తన సహాయ కుడైన శివ అనే వ్యక్తి ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం డబ్బులు, సంబంధిత రికార్డులు స్వాధీనపరుచుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని రేపు కర్నూలు జిల్లా ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి గారి వద్ద హాజరు పరచనున్నారు.

కేసు దర్యాప్తులో ఉన్నది.

Leave a Reply

Your email address will not be published.