కార్ యాక్సిడెంట్ lలో షబానా ఆజ్మీ కి తీవ్ర గాయాలు

ప్రముఖ బాలీవుడ్ నటి అలనాటి హీరోయిన్ షబానా అజ్మీ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్‌కు గురైయింది. ఈసంఘటన ముంబాయి, పూణే ఎక్స్ ప్రెస్ హైవేలోని కహల్పూర్లో జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారు ట్రక్‌ను ఢీ కొంది. ఈ ఘటనలో ఆమెతో పాటు కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె భర్త జావేద్ అఖ్తర్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వెంటనే షబానా అజ్మీతో పాటు ఆమె కారు డ్రైవర్‌ను సమీపంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వాళ్ల పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
బాలీవుడ్లో ఆర్ట్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు షబానా అజ్మీ. ఇప్పటి వరకు ఉత్తమ నటిగా ఐదు జాతీయ చలన చిత్ర పురస్కారాలను అందుకొంది. ఆమె భర్త జావేద్ అఖ్తర్ ప్రముఖ బాలీవుడ్ రచయత. ఆయన ‘షోలే’, ‘జంజీర్’ వంటి సినిమాలకు సలీమ్ ఖాన్‌తో కలిసి రచనలు చేశాడు. షబానా తండ్రి కైఫ్ అజ్మీకి బాలీవుడ్లో చాలా సినిమాలకు మాటలతో పాటు పాటలు రాశారు. షబానా అజ్మీ స్వస్థలం హైదరాబాద్. ప్రముఖ నటి టబుకు షబానా అజ్మీ స్వయాన మేనత్త. ఈమె మరో మేనకోడలు ఫర్హా కూడా కథానాయికగా పలు చిత్రాల్లో నటించింది.