మోహన్ మీడియా క్రియేషన్స్ లో LOVE 20-20.

మోహన్ మీడియా క్రియేషన్స్ లో మోహన్ వడ్లపట్ల, మహేందర్ వడ్లపట్ల మరియు జో శర్మ, మెక్విన్  గ్రూప్ USA సహకారంతో వడ్లపట్ల సినిమాస్ సమర్పిస్తున్న కొత్త చిత్రం లవ్ 20-20. ఈ చిత్రం ద్వారా అరవింద్, మోహిని (Miss Teen Canada 2012) హీరోహీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈచిత్రం బెంగుళూర్, నాగర్హోలే నేషనల్ పార్క్, కూర్గ్, కుషాల్ నగర్, ఊటీ, ఇడుక్కి (కేరళ) మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుని… ఫిబ్రవరి 1 నుండి 6 వ తేదీ వరకు నవి ముంబై లోని ముఖ్యప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ తో పాటుగా ఫైనల్ సాంగ్ మరియు షూటింగ్ కూడా పూర్తిచేసుకోనుంది. ఈ చిత్రం సెంథిల్ కుమార్ దర్శకత్వంలో కొత్త కథాంశంతో  తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి ప్రత్యేకంగా యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా లవ్ 20-20 అనే టైటిల్ ఖరారు చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల అనంతరం  ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో విడుదల చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి మ్యూజిక్: సత్యన్, పాటలు: కిట్టూ విస్సాప్రగడ, సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్, ఎడిటింగ్: పొన్నవేల్, ఆర్ట్: ప్రభాకరన్, నిర్మాత: మోహన్ వడ్లపట్ల మరియు మహేందర్ వడ్లపట్ల, లైన్ ప్రొడ్యూసర్: వి. సాగర్, రచన, దర్శకత్వం: వి.ఎస్.   

Leave a Reply

Your email address will not be published.