రీపోలింగ్‌కు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశo….

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో అధికారుల తప్పిదాల కారణంగా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తోందని గుర్తించిన జిల్లా అధికారులు కొందరిపై సస్పెన్షన్ వేటు వేసారు. మహబూబ్‌నగర్ జిల్లా 41వ వార్డులోని 198వ పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓట్లు ఎక్కువగా నమోదైన కారణంగా రీపోలింగ్‌కు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారు.
టెండర్ ఓట్లు పడటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తోందని జిల్లా ఎన్నికల అధికారి గుర్తించారు. దీంతో ఈ పోలింగ్ కేంద్రంలో పీవో, ఏపీవో, ముగ్గురు ఓపీవోలు మొత్తంగా 5గురు అధికారులను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఉత్వర్వులు జారీ చేశారు.