త‌న అవార్డు మెగా అభిమానుల‌కు అంకిత‌O…. తైక్వాండో శ్రీను

రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప‌నిచేస్తున్న తైక్వాండో శ్రీను కు శ్రీ‌కాకుళం జిల్లాల‌లో అధిక ర‌క్త‌దాన శిబిరాలు నిర్వ‌హించినందుకు జిల్లా స్ధాయి సేవా పుర‌స్కారం అందింది.  71వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో…జిల్లా కలెక్టర్ జె నివాస్ , జిల్లా ఎస్పీ అమ్మి రెడ్డి  లు శ్రీ‌నుకు ఈ   జిల్లాస్థాయి అవార్డు.., ప్రశంసాపత్రం ను ఆయనకు ప్రధానం చేశారు.  

త‌న‌ని ఈ పుర‌స్కారంకి ఎంపిక చేయ‌టంపై  తైక్వాండో శ్రీను హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ,  మెగా ఫ్యామిలీ అభిమానులతో… జిల్లా రెడ్క్రాస్ ద్వారా రెడ్ క్రాస్ రక్తనిధి కి, పెద్ద ఎత్తున ర‌క్తం స‌మ‌కూర్చ‌టం ఆనందంగా ఉంద‌ని, ఈ ఏడాది కూడా అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించడం తో  పాటు పాలు సేవా కార్యక్రమాలు చేస్తామ‌ని అన్నారు. త‌న అవార్డు మెగా అభిమానుల‌కు అంకిత‌మ‌ని ఈ సంద‌ర్భంగా  తైక్వాండో శ్రీను చెప్పారు.  

Leave a Reply

Your email address will not be published.