‘RAW’ (రా) పోస్టర్ విడుదల

అనంతరం త్రినాధ్ నక్కిన మాట్లాడుతూ.. RAW (రా) అనే టైటిల్ ను చూడగానే కొత్తగా అనిపించింది. అలానే పోస్టర్ లో కూడా కొత్తదనం కనపడుతోంది. సినిమాలో ఏదైనా విషయం ఉంటేనే వర్కౌట్ అవుతాయి దానికి బెస్ట్ కంటెంట్ చెప్పుకుంటే హారర్ కామెడీ లేదా లవ్ స్టోరీ ఉండాలి అవే ఈ RAW (రా) సినిమాలో ఉన్నాయని
దర్శకుడు, నిర్మాత రాజ్ డొక్కర మాట్లాడుతూ.. RAW (రా) సినిమాను ఒక ట్రూ స్టోరీ ని బేస్ చేసుకొని చేసిన సినిమా. మా సినిమా లో RAW( రా) అంటే ఏంటి అనేది ఇంటర్వెల్ లో అబ్రివేషన్ తో పాటు రివీల్ చేయడం జరుగుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్. ఇందులో డ్రంక్ అండ్ డ్రైవ్ మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. రెండు పాటలు, రెండు ఫైట్స్ మిగిలి ఉన్నాయి. త్వరలో అవికూడా పూర్తి చేసి ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇక మా టీమ్ అందరూ ఎంతో ఇష్టం తో కస్టపడి పని చేశారు. 25 డేస్ లో సినిమా షూటింగ్ పూర్తి చేయగలిగాము అంటే అది వీరిచ్చిన సపోర్ట్ కారణం అని తెలిపారు.
హీరోయిన్ లోహిత మాట్లాడుతూ.. నాలో ఇంత టాలెంట్ ఉందని నాకే తెలియదు. డైరెక్టర్ గారు చాలా ఎంకరేజే చేశారు. థ్రిల్లర్ జోనర్. సినిమా చాలా బాగొచ్చింది. అందరం చాలా కష్టపడి పనిచేశాము మీకు కూడా మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాను అని చెప్పారు.
హీరో మనోహర్ మాట్లాడుతూ.. RAW (రా) అంటే ఫుల్ ఫార్మ్ ఏంటి అనేది సినిమా లోనే చెబుతాము. ఆర్టిస్టులతో కలసిపోయి టెక్నీషియన్స్ వర్క్ చేశారు. ఈ సినిమాలో ఒక పాప ఉంది. ఆ పాప పాత్రే ఈ సినిమాకు వెన్నెముక. సినిమా చాలా బాగుంటుంది. మమ్మల్ని ఆదరించండని అన్నారు.
హీరో చంటి మాట్లాడుతూ.. త్రినాధ్ నక్కిన గారు మా కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇచ్చే ప్రోత్సాహం వల్లే నేను ఇప్పుడు ఇక్కడున్నాను. అందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. మా సినిమాలో ప్రతి సీన్ ఆకట్టుకునేలా ఉంటుంది. చాలా ఇష్టం తో ఈజీ గా వర్క్ చేసాము. టీమ్ సపోర్ట్ చాలా బాగుందని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్, స్వీటీ, ఆజాద్ ఖాన్, సూర్య లతో పాటు తదితరులు పాల్గొని తమ అభినందనలు తెలియచేసారు.
చంటి, మనోహర్, లోహిత, ఇర్ఫాన్ , స్వీటీ, ఆజాద్ ఖాన్, సూర్య, వినోద్, హాడీ, నయీమ్, శ్రీనివాస్ ప్రధాన ప్రాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: రాజ్ డొక్కర, కెమెరా: రాజేష్ భూపతి, కో డైరెక్టర్: సురేష్ వాన పిల్లి, మ్యూజిక్: కె. వేద, లిరిక్స్: రామాంజనేయులు, మేకప్: గణేష్, స్టంట్స్: రాజేష్, కొరియోగ్రఫీ: గణేష్ స్వామి, ప్రొడక్షన్: పి. సంతోష్ కుమార్, వెంకీ (పార్వతి పురం ). ఆర్ట్: రాఘవ, అఖిల్.