కిరణ్ అబ్బవరం హీరోగా ‘ SR కళ్యాణమండపం – Est. 1975 ‘ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో వెండి తెర మీద‌కు వ‌చ్చిన కిరణ్ అబ్బవరం హీరోగా, టాక్సివాలా సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకున్న ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా   ఎలైట్ గ్రూప్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ SR కళ్యాణమండపం – Est. 1975 ‘ అనే టైటిల్ ని ఖరారు చేసారు.  ఈ చిత్రం  ఒక కళ్యాణమండపం చుట్టూ జరిగే క‌థ‌తో  రాయలసీమ నేపథ్యంలో ఉంటుంద‌ని  ఈ చిత్రం ద్వారా  దర్శకుడిగా పరిచయమవుతున్నశ్రీధర్ గాదె మీడియాకు వివ‌రించారు.

ఈ సినిమాలో ‘డైలాగ్ కింగ్’ సాయి కుమార్ తొలిసారిగా పూర్తిగా రాయలసీమ మాండలికంతో  హీరో తండ్రి గా  న‌టిస్తున్నార‌ని తెలిపారు, తండ్రీ కొడుకుల మధ్య బంధాన్ని  వినోదాత్మక అంశాలతో కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా  చిత్రాన్ని రూపొందిస్తామ‌ని గా ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదె తెలిపారు.  ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 13 నుంచి ఆరంభ‌మ‌వుతుంద‌ని చెప్పారు. ఈ చిత్రంలో కిరణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, తులసి శివమణి, అరుణ్ కుమార్, అనిల్ జీలా, కష్యప్ శ్రీనివాస్ త‌దిత‌రులు న‌టిస్తున్నార‌ని వివ‌రించారు. 

Leave a Reply

Your email address will not be published.