ఫ్యాషన్ స్టైలిస్ట్ ప్రణవి రచించిన “To All who Wander” పుస్తకం విడుదల


ఫ్యాషన్ స్టైలిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రణవి రచించిన “To All who Wander” పుస్తకం లాంచ్ కార్యక్రమం బంజారాహిల్స్ లో జరిగింది.  పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన రాజ్ కుందుకూరి, బెక్కం వేణుగోపాల్ చేతుల మీదుగా ఈ బుక్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రచయిత ప్రణవి తండ్రి ఆర్ వి కె వర్మ, రిజిస్ట్రేషన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ చిరంజీవులు పాల్గొన్నారు. ముగ్గురు మహిళల కెరీర్, డ్రీమ్స్, ఫ్యామిలీ, ప్రేమ వారి ప్రయాణం లాంటి విషయాల్ని భావోద్వేగమైన తన రచనతో  ఇందులో  పొందుపరిచారు. స్వతహాగా భగవద్గీతను బలంగా నమ్మే ప్రణవి ఈ పుస్తకంలో పలు అంశాల్ని ఎమోషనల్ గా టచ్ చేశారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫ్యాషన్ స్టైలిస్ట్ గా పనిచేస్తోంది. చిన్నప్పటినుంచే చిన్న చిన్న కథలు రాస్తూ… బ్లాగ్స్ ద్వారా తన మనోభావాల్ని నలుగురితో పంచుకునేది. ఇక ఇప్పుడు తన మనసులోని భావాల్ని ఈ పుస్తకం ద్వారా వెలికితీసింది. పలు చిత్రాలకు స్క్రీన్ ప్లే సహకారం కూడా అందించడంతో ఈ పుస్తకం రాయడానికి ఆ అనుభవం కూడా ఉపయోగపడింది. 

ఈ సందర్భంగా… ప్రణవి తండ్రి ఆర్ వి కె వర్మ మాట్లాడుతూ… రెండు సందర్భాల్లో నేను అత్యంత సంతోషంగా ఉన్నాను. నా కూతురు పుట్టినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో. ఇప్పుడు ప్రణవి తండ్రి అని చెప్పుకునే విషయంలో అంతే గర్వపడుతున్నాను. అని అన్నారు. 

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ…. ప్రణవి మంచి మనసున్న అమ్మాయి. నాకు కొన్ని కథలు కూడా చెప్పింది. ఆమె మంచి రచయిత అని ధీమాగా చెప్పగలను. భవిష్యత్తులో మంచి రచయితగా పేరు తెచ్చుకుంటుంది. అని అన్నారు. 

నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ… ప్రణవిలో మంచి క్రియేటివిటీ ఉంది. ఈ బుక్ రైట్స్ నాకు ఇవ్వమని అడుగుతున్నాను. అని అన్నారు. 

రిజిస్ట్రేషన్స్ ఇన్స్పెక్టర్ జనరల్ చిరంజీవులు మాట్లాడుతూ…  ప్రణవి చాలా విషయాల్లో ప్రతిభ కలిగిన అమ్మాయి. తన మనోభావాల్ని రాసి ప్రపంచానికి చూపిస్తుంది. బ్రిలియంట్ రైటర్. అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published.