నేను చెప్పిందే ఫైనల్ …… జి వి ఎల్ Vs కన్నా

ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతిని  ఏపీ రాజధాని గా కొనసాగించాలని దీక్ష చేసి ఆందోళనలు చేపట్టిన ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కు వ్యతిరేకంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా జివిఎల్ నరసింహారావు మాట్లాడటం రాజధాని వ్యవహారంపై బీజేపీ నాయకుల మధ్య ఏకాభిప్రాయం లేదని స్పష్టమైనది ఆంధ్ర ప్రదేశ్ విజయవాడలో బిజెపి కార్యాలయంలో సోమవారం నాడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జివిఎల్ నరసింహారావు  మాట్లాడుతూ రాజధాని తరలింపు అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం  రాజధాని తరలింపు లో  కేంద్ర ప్రభుత్వ జోక్యం ఏమీ ఉండదని ఈ విషయంలో ఏవైనా సలహాలు సూచనలు అడిగితే ఇస్తుంది తప్ప తనంతట తానుగా కేంద్రం జోక్యం చేసుకోదని, ఈ విషయంలో బీజేపీ అధికార ప్రతినిధిగా నేను చెప్పిందే ఫైనల్ అని మిగతా బిజెపి నాయకులు ఎవరు మాట్లాడినా అది వారి వ్యక్తిగతం తప్ప పార్టీకి సంబంధం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Leave a Reply

Your email address will not be published.