చీఫ్ సెక్రటరీ Vs ప్రిన్సిపాల్ సెక్రటరీ…! ఏం జరుగుతుందో అర్దం కాని ఉద్యోగులు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానికి ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి మరియు జిఎడి పొలిటికల్‌ శాఖిదిపతి ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌కు మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయని, అసలు కారణాలు బయట పడకపోయినా వారిద్దరిమధ్య వాదోపవాదాలు జరిగాయని ప్రచారం జరుగుతోంది.

నీలం సహానిని నేనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా చేశాను… నా మాట ఆమె విని తీరాల్సిందే అని ప్రవీణ్‌ ప్రకాష్‌ పెత్తనం చేస్తున్నారని అధికారులు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ కోరికపైనే కేంద్ర సర్వీసులో ఉన్న తాను ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిగా వచ్చానే తప్ప ప్రవీణ్‌ ప్రకాష్‌ సిఫార్సుతో రాలేదని తనకున్న అదికార అనుభవంతో ఆంధ్ర రాష్ట్రంలో పని చేయాలని భావించానని మరో ఆరునెలల్లో రిటైర్డు కాబోతున్న నేపధ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగారిటైర్డు అవ్వాలని ఏపి వచ్చా అంటున్నారట నీలం సహాని. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు మీద జారీకావాల్సిన ఉత్తర్వులు ప్రవీణ్‌ ప్రకాష్‌ పేరుతో జారీ కావటంపై నీలం సహాని అసహనం వ్యక్తం చేశారని అనుకుంటున్నారు. తన కన్నా ఎన్నో ఏళ్లు జూనియర్‌ అయిన ఐఎఎస్‌ అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న తనపై పెత్తనం చేయటం ఏమిటి అని నీలం ఎవరి దగ్గర అభ్యంతరం చేయాలో.. వారిదగ్గరే అభ్యంతరం వ్యక్తం చేసినట్లు విశ్వనీయ వర్గాల సమాచారం.

ఇష్టం ఉన్నా లేకున్నా ముఖ్యమంత్రి ఆశీస్సులు ఉన్నాయని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శిపై అధికార జులుం చెలాయిస్తున్నారా..? ఆమెపై పెత్తనం చేయటం సరైన విదానం కాదంటున్నారు కొందరు ఐఎఎస్‌ అధికారులు. వీరిద్దరి మధ్య వాద ప్రతివాదనలు జరిగాయని మాట మాట పెరిగిందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి నీలం సహాని తీసుకువెళ్లారని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య విభేదాలు ఏ విషయంలో బయట పడ్డాయి..? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని ఈ మధ్య కాలంలో ఎందుకు అసహనంగా కనిపిస్తున్నారు. తాను కేంద్ర సర్వీసుల నుండి ఆంధ్ర రాష్ట్రం కు వచ్చి తప్పు చేశానా అని ఆమె ఆలోచనలో పడ్డారని ఆమె పలువురు అధికారులు అనుకుంటున్నారు.

త్వరలో అన్ని విషయాలు బయట పడటం ఖాయమంటున్నారు అధికారులు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి పదవిని గౌరవించాలే తప్ప తన కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ చెప్పిందే వేదంగా అమలు చేయకూడదంటున్నారు అధికారులు. ఏది ఏమైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాను తప్పని సరిగా అందరూ గౌరవించాల్సిందే. కానీ తాజాగా సచివాలయంలో జరుగుతున్న సంఘటనలను బట్టి అసలు ఏం జరుగుతుందో అర్దం కావటం లేదంటున్నారు ఉద్యోగులు. ఏది ఏమైనా ఈ ప్రచారానికి కాలమే సమాధానం చెప్పాలి.కాని

Leave a Reply

Your email address will not be published.