www. మీనా బజార్ ఆడియో లాంచ్

సినీ రాజకీయల సమక్షంలో www. మీనా బజార్., ఆడియో లాంచ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లో జరిగింది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో నటి దివ్యవాణి, హేమ, నక్కిన త్రినాధ్ రావు, నవీన్ యాదవ్, పాల్గొని చిత్ర యూనిట్ సభ్యులకు బెస్ట్ విషెస్ తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు సునీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. సి.కళ్యాణ్ గారు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసి చెప్పినట్టే అందరి ఆదరణ పొందుతుండటం ఆనందంగా ఉందని అన్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి రాంగోపాల్ వర్మ సినిమాలా ఉందంటూ మా www. మీనా బజార్ ని పోల్చడం చూస్తుంటే సినిమా మీద మా నమ్మకం పెరిగిందని అన్నారు. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న మా సినిమా మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు చెప్పారాయన.